ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం..
*ఉదయగిరి మండలంలోని కొండాయపాలెం గ్రామపంచాయతీ మాసాయిపేట గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం..*
సాక్షిత నెల్లూరు బ్యూరో గంగిరెడ్డిపల్లి :
ఉదయగిరి మండలం కొండాయపాలెం పంచాయితీలోని మాసాయిపేట గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పౌర్ణమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెంచిన కార్యక్రమం లో నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ అన్న సూచనలతో మరియు రాష్ట్ర కార్యదర్శి మన ఫౌండేషన్ అధినేత మన్నేటి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు, మండల యూత్ నాయకులు గానుగపెంట పల్లీ నారాయణ రెడ్డి ,మండల ఎస్సీ సెల్ నాయకులు బొగ్గవరపు శ్రీహరి మరియు సచివాలయం సిబ్బంది ఉదయం 6:00 గంటల నుండి పెన్షన్ దారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి పేద వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ప్రతి నెల ఒకటవ తేదీన ఉద్యోగస్తుల జీతాల కంటె ముందుగా అందించటం చాలా మంచి కార్యక్రమoగా పేర్కొనటం జరిగింది, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరగటానికి ముఖ్య కారకులైన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతధ్నతలు తెలపటం జరిగినది.పై కార్యక్రమంలో టీడీపి నాయకులు.తదితరులు పాల్గొన్నారు..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
