కే.సీ.ఆర్. కృషి కారణంగా నే తెలంగాణా రాష్ట్రం సిద్దించింది

Sakshitha news

కే.సీ.ఆర్. కృషి కారణంగా నే తెలంగాణా రాష్ట్రం సిద్దించింది

దీక్షా దివస్ ను జయప్రదం చేయాలి : పద్మారావు గౌడ్ పిలుపు
సికింద్రాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీ ఆర్‌ తన ప్రాణాలను లెక్క చేయకుండా చేపట్టిన దీక్ష రోజును దీక్షా దివస్‌గా నిర్వహించే పద్దతిని పాటిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు.

సితాఫలమండీ లోని ఎం.ఎల్.ఏ. క్యాంపు కార్యాలయంలో సికింద్రాబాద్ నియోజకవర్గ బీ.ఆర్.ఎస్. నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ కే.సీ.ఆర్. కృషి కారణంగానే తెలంగాణా రాష్ట్రం సాధించుకోగాలిగామని తెలిపారు.

శనివారం సికింద్రాబాద్ నుంచి తెలంగాణా భవన్ కు భారీగా కార్యకర్తలు తరలి రావాలని, సితాఫలమండీ నుంచి ఉదయం బయలుదేరాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని వియయవంతం చేసేందుకు కార్పొరేటర్లు, నాయకులు కృషి చేయాలి. సమావేశం లో కార్పొరేటర్లు సామల హేమ, రాసురి సునీత, కంది శైలజ, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, సమన్వయకర్త రాజ సుందర్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top