శంకర్‌పల్లిలో కన్నుల పండుగగా అయ్యప్ప స్వామి పాదయాత్ర పడిపూజ

Sakshitha news

శంకర్‌పల్లిలో కన్నుల పండుగగా అయ్యప్ప స్వామి పాదయాత్ర పడిపూజ

శంకర్‌పల్లి: సాక్షిత): శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని తెలంగాణ శబరిమల గా పేరుగాంచిన అయ్యప్ప స్వామి ఆలయంలో కన్నుల పండుగగా అయ్యప్ప స్వామి పాదయాత్ర పడిపూజ జరిగింది. ఈ పడి పూజకు అయ్యప్ప స్వాములు, మహిళలు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని, స్వామి వారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు.

41 రోజులు శబరిమలకు పాదయాత్రగా విజయవంతంగా వెళ్లి తిరిగి వచ్చిన స్వాములను ఆలయ ప్రాంగణంలో ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించి, స్వామివారి చిత్రపటాలను బహుకరించారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో దండు మోహన్, జాదవ్ వెంకటేష్ యాదవ్, గుండ శేఖర్, జంగయ్య, లింగం, రాఘవేందర్, సాయికిరణ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, భరత్ రెడ్డి, శ్రీకర్, మురళి, విక్రాంత్ ఉన్నారు.

Scroll to Top