టీటీడీ ఆధ్వర్యంలో భ‌గ‌వ‌ద్గీత కంఠ‌స్థ పోటీలు

Sakshitha news

టీటీడీ ఆధ్వర్యంలో భ‌గ‌వ‌ద్గీత కంఠ‌స్థ పోటీలు

** తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో….

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: టీటీడీ హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీన, ఆదివారం (రేపు) తిరుప‌తి అన్న‌మాచార్య క‌ళామందిరంలో ఉద‌యం 9 గంట‌ల‌కు భ‌గ‌వ‌ద్గీత కంఠ‌స్థ పోటీలు నిర్వ‌హించ‌ నున్నారు. టీటీడీ విద్యాసంస్థ‌ల‌తో పాటు తిరుప‌తిలో స్థానికంగా చ‌దువుతున్న విద్యార్థినీ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్న‌వ‌చ్చు. ఇందులో భాగంగా భ‌గ‌వ‌ద్గీత 14వ అధ్యాయం (గుణత్రయ విభాగ యోగం)లో 6 నుంచి 9వ త‌ర‌గ‌తి విద్యార్థినీ విద్యార్థులు ఒక విభాగంగాను, మరో విభాగంలో 10వ త‌ర‌గ‌తి విద్యార్థినీ విద్యార్థులకు 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగంపై పోటీలు నిర్వ‌హించ‌ నున్నారు. అలాగే, 18 నుంచి 45 సంవత్సరాల లోపు వారికి నిత్యజీవితంలో భగవద్గీత – భావ విశ్లేషణ అనే అంశంపై పోటీలు నిర్వహించనున్నారు.


ఆస‌క్తిగ‌ల‌వారు 30న ఉద‌యం 9 గంట‌ల‌కు తిరుపతి అన్న‌మాచార్య క‌ళామందిరంకు చేరవ‌లెను. మ‌రిన్ని వివ‌రాల‌కు 9676615643, 8500049345 నంబ‌ర్లలో సంప్ర‌దించాల్సి ఉంటుంది.
ఈ పోటీల్లో గెలుపొందిన వారికి గీతాజయంతి సందర్భంగా డిసెంబ‌రు 1వ తేదీన బహుమతులు ప్రధానం చేస్తారు.

Scroll to Top