గొప్ప సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిబాపూలే

Sakshitha news

గొప్ప సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిబాపూలే

  • ఎమ్మెల్యేమేఘారెడ్డి

సాక్షిత వనపర్తి
తన భార్య సావిత్రిభాయ్ ఫూలేతో కలిసి బాలికల కోసం దేశంలో మొదటి పాఠశాలను స్థాపించి మహిళలకు విద్యాబోధన చేసిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిబాపూలే గారని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు

పూలే వర్ధంతి సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల వివక్షతను తొలగించి సామాజిక సమానత్వం కోసం ఉద్యమించిన సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్త సంఘ సంస్కర్త పూలే అన్నారు దళిత వర్గాల అభివృద్ధి,సాధికారత కోసం ముందుకు తీసుకువచ్చి మహిళలకు కూడా విద్య అందించాల్సిన అవసరాన్ని ఉందని తన సతీమణి సావిత్రి భాయ్ తో విద్యాభ్యాసం చేయించిన గొప్ప వ్యక్తి పూలే అన్నారు

కార్యక్రమంలో వనపర్తి యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వాకిటి ఆదిత్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ, పట్టణ మాజీ కౌన్సిలర్లు చీర్ల సత్యం, వెంకటేష్, మధుగౌడ్, యాదగిరి, శరవంద, విభూది నారాయణ, వినోద్ గౌడ్, బొంబాయి మన్నెకొండ, పరుశురాం, నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్ ఎస్టి, ఎస్సి, బిసి, మైనార్టీ నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top