రైతుల మేలు కోసం కొనుగోలు నిబంధనలు సరళీకృతం చేయాల్సిందే : ప్రత్తిపాటి

Sakshitha news

రైతుల మేలు కోసం కొనుగోలు నిబంధనలు సరళీకృతం చేయాల్సిందే : ప్రత్తిపాటి

  • ప్రభుత్వాలు కూడా రైతులకు మేలు చేకూర్చే అంశాల విధానాల్లో పరిస్థితులకు తగినట్టు మార్పులు చేయాలి. ప్రత్తిపాటి
  • సీసీఐ నిబంధనల సరళీకృతంపై ముఖ్యమంత్రి కార్యాలయంతో మాట్లాడాను. ప్రత్తిపాటి.
  • మన నాయకుడి గొప్ప ఆలోచనలు… ఆచరణలో పెట్టినప్పుడే ఉత్తమ ఫలితాలు.. ఎంపీ లావు.
  • కావూరు, కోమటినేనివారిపాలెం గ్రామాల్లో రూ.39 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే, ఎంపీ
  • రైతన్నా మీకోసం కార్యక్రమంలో భూసార పరీక్షకార్డులు పంపిణీచేసిన మాజీమంత్రి ప్రత్తిపాటి, ఎంపీ లావు

రైతులకు మేలు చేకూర్చే అంశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల్లో తప్పక మార్పు రావాలని, సీసీఐ కొనుగోళ్లలో నిబంధనల సరళీకృతంపై ముఖ్యమంత్రి కార్యాలయంతో మాట్లాడానని, పత్తి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి అచ్చెన్నాయుడు కూడా భరోసా ఇచ్చినందున రైతులు అధైర్య పడాల్సిన పనిలేదని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు భరోసా ఇచ్చారు.

బుధవారం మాజీమంత్రి ప్రత్తిపాటి, ఎంపీ లావు కావూరు, లింగంగుంట్ల, కోమటినేనివారిపాలెం గ్రామాల్లో నిర్వహించిన రైతన్నా… మీకోసం కార్యక్రమంలో పాల్గొని రైతులకు భూసార పరీక్షా కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లింగంగుంట్లలో నిర్వహించిన రైతుసభలో శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడారు. రైతన్నా మీకోసం కార్యక్రమానంతరం కావూరులో రూ.7 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, డ్రైన్ల పనులకు, కోమటినేనివారిపాలెంలో రూ.32 లక్షలతో నిర్మించ తలపెట్టిన పంచాయతీ భవనం నిర్మాణానికి ఎమ్మెల్యే ప్రత్తిపాటి శంకుస్థాపన చేశారు.

నిబంధనల పేరిట రైతుల్ని ఇబ్బంది పెడితే, పాలకులు, ప్రభుత్వంపై అసంతృప్తి అధికమవుతుంది..
రైతుల ఉత్పత్తుల కొనుగోలులో సీసీఐ, మార్క్ ఫెడ్ అధికారులు ఉదారంగా వ్యవహరించాలని, నిబంధనల పేరిట రైతుల్ని ఇబ్బందిపెడితే వారిలో పాలకులు, ప్రభుత్వంపై అసంతృప్తి అధికమవుతుంద దన్నారు. ఎక్కడికక్కడ రైతుల ఇబ్బందులు, ప్రాంతాల్లోని పరిస్థితులకు అనుగుణంగా కొనుగోలు నిబందనలు మార్చినప్పుడే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని అన్ని లిఫ్టుల ఆధునికీకరణకు ప్రభుత్వం త్వరలోనే టెండర్లు పిలవనుందని, ఆ పనులు పూర్తై, వాగుల్లో పూడికతీత చేపడితే సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా పోతుందని ప్రత్తిపాటి చెప్పారు.

మన నాయకుడి ఆలోచనలు ఆచరిస్తేనే ఉత్తమ ఫలితాలు..
మన నాయకుడు చంద్రబాబు ఆలోచనలు గొప్పగా ఉంటాయని, అవి ఆచరణలో పెడితేనే ప్రజలకు ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ప్రత్తిపాటి చెప్పారు. తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించాలన్న ప్రభుత్వ సూచనల్ని రైతులు ఆచరణలో పెట్టాలన్నారు. గతంలో చంద్రబాబు నాయకత్వంలో డ్రిప్, స్ప్రింక్లర్ విధానంతో రాయలసీమ రైతులు ఉత్తమ ఫలితాలు సాధించారని ప్రత్తిపాటి గుర్తుచేశారు. అదే విధంగా సాగులో సాంకేతికత వినియోగంపై రైతులు ఆలోచనలు మారాలన్నారు.
రూ.20 లక్షల సొంత నిధులతో లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థను బాగుచేయించిన సంజీవరాయుడిని ఈ సందర్భంగా ప్రత్తిపాటి సభసాక్షిగా అభినందించారు. ఈ సందర్భంగా గ్రామంలో 70 ఏళ్ల వయసులో కూడా సుబాబుల్ తో పాటు ఇతర కూరగాయాలు పండిస్తూ, రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న ఒక పెద్దాయనని ప్రత్తిపాటి అభినందించారు.

కార్యక్రమంలో జనసేన ఇంచార్జి తోట రాజారమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, జిల్లా రైతు అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి, సొసైటీ చైర్మన్ కోడె హనుమంతరావు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు గట్టినేని విజయ్ సాయి, కేతినేని సతీష్, తుబాటి కిషోర్, రెడ్డయ్య, బొప్పూడి చంద్రశేఖర్, వెంకట స్వామి, ప్రసాద్, మాలెంపాటి ఉమా, శివయ్య, రఘు, సాంబశివరావు, వెంకటేశ్వర్లు, అగ్రికల్చర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top