దిల్లీ ఆంధ్రాభవన్ వేడుకలో చిత్తూరు ఎంపీ
సాక్షిత ప్రతినిధి – దిల్లీ / చిత్తూరు: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఆంధ్ర భవన్లో జరిగిన భారత రాజ్యాంగ దినోత్సవంలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు పాల్గొన్నారు.
అంబేద్కర్ ఫాలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాన్స్టిట్యూషన్ డే ఉత్సవాలకు చిత్తూరు ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూనే.., భారత రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛతో ప్రజలందరికీ మేలు చేయాలని కోరారు. అప్పుడే అంబేద్కర్ కు మనం ఇచ్చిన ఘన నివాళి అని పేర్కొన్నారు.

