మల్కాజిగిరి డివిజన్, రాధాకృష్ణ నగర్ కాలనీకి చెందిన జయంతి లాల్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం
ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ద్వారా దరఖాస్తు చేసుకున్నారు.ఈ మేరకు 2,00,000( రెండు లక్షల రూపాయలు) విలువైన ఎల్ఓసి మంజూరు కాగా శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి , మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ తో కలిసి బోయిన్ పల్లి క్యాంప్ ఆఫీసులో బాధితుడికి ఎల్ఓసి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీ.ఎం సంక్షేమ సహాయనిది పేదలు అనారోగ్యానికి గురైన సమయంలో వారికి ఆపన్న హస్తంలా ఉపయోగపడుతుందని అన్నారు.నిరుపేదల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వారి సంక్షేమానికి పాటుపడుతున్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కి వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ వెంకన్న, చిన్న యాదవ్, నవీన్, మధుసూడాన్ రెడ్డి,శివ గౌడ్,సుమన్ గౌడ్,సుమన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

