విశాఖ స్టీల్ ప్లాంట్ ను పోస్కో సంస్థకు అమ్మేయాలనుకున్నప్పుడు జగన్ కు కార్మికుల కష్టసుఖాలు గుర్తురాలేదా? : ప్రత్తిపాటి
కష్టపడితేనే సంస్థలకైనా, వ్యక్తులకైనా మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పడమే చంద్రబాబు తప్పా? : ప్రత్తిపాటి..
గత పాలకులు ఉక్కు ఫ్యాక్టరీని లేపేసి రాజధాని కడతామన్నప్పుడు విశాఖ ఉక్కు పరిరక్షకులు నోరేత్తలేదేం? : ప్రత్తిపాటి..
విశాఖ స్టీల్ ప్లాంట్ ను గంపగుత్తగా రూ. 500 కోట్లకే పోస్కో సంస్థకు దారాధత్తం చేయాలని చూసిన జగన్ అండ్ కో విషప్రచారాన్ని ప్రజలు ఎప్పటికి నమ్మరు : ప్రత్తిపాటి.
రాష్ట్ర ప్రగతికి అడ్డుపడే రాజకీయ అజ్ఞానులు, కాలానుగుణంగా మారుతున్న అభివృద్ధిసాధ్యసాధ్యాల గురించి తెలియని మందబుద్ధులే విశాఖ ఉక్కుఫై ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యల్నివక్రీకరిస్తున్నారు.
కష్టపడితేనే సంస్థలకైనా, వ్యక్తులకైనా మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పడం తప్పెలా అవుతుందో వారు సమాధానం చెప్పాలి.ఒక పబ్లిక్ సెక్టార్ సంస్థకు గతంలో దేశంలో ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు చేయని సాయం చంద్రబాబు చేశారనే నిజాన్ని గ్రహించాలి.
అప్పుడు స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టి.. ఇప్పుడు నీతివాక్యాలా?
అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా స్టీల్ ప్లాంట్ ఆస్తులు, భూములు అమ్మకానికి పెట్టిన జగన్ & కో నేడు నీతి వాక్యాలు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మొత్తం ఉక్కు ఫ్యాక్టరీనే గంపగుత్తుగా రూ. 500 కోట్లకే పోస్కో సంస్థకు దారాధత్తం చేయాలని చూసిన వారు నేడు పోసుకోలు కబుర్లతో రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారనే నిజం ప్రజలకు తెలియంది కాదు.గత పాలకులు ఉక్కు ఫ్యాక్టరీని లేపేసి ఆ ప్రాంతంలో రాజధాని కడతామన్నప్పుడు విశాఖఉక్కుపరిరక్షకులు, కార్మిక పక్షపాతులు నోరేత్తలేదేమి?విశాఖ ఉక్కు పేరేత్తే అర్హత జగన్ కు వైసీపీకి లేదు.
వాజ్ పేయ్ హాయాం నుంచి మోదీ పాలన వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకు చంద్రబాబు ఎంతో కృషి చేశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చంద్రబాబు, పవన్ కల్యాణ్,బీజేపీనేతలు విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకు కృషిచేశారు. ప్లాంట్ ను కాజేయాలని చూసిన జగన్ దుర్మార్గాన్ని పటాపంచలు చేస్తూ కేంద్రాన్ని ఒప్పించి, రాష్ట్రప్రభుత్వ రాయితీలతో కలిపి చంద్రబాబు రూ.14 వేల కోట్ల వరకు సాయం అందేలా చూశారు.అంతకుముందు వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్నప్పుడే స్టీల్ ప్లాంట్ నష్టాల భర్తీకి రూ.1350 కోట్లు అందించింది చంద్రబాబు కాదా? మరోసారి రూ.1400 కోట్ల ప్యాకేజీ మంజూరు చేయించి ప్లాంట్ మనుగడను కాపాడిందిముమ్మాటికీ ముఖ్యమంత్రి చంద్రబాబే. ప్రభుత్వ సాయం, సహకార సద్వినియోగంతో సంస్థను వృద్ధి చేస్తేనే కార్మికులు, వారి కుటుంబాలకి ఉజ్వల భవిష్యత్ ఉంటుందనే అందరూఅంగీకరించాల్సిన వాస్తవం. ప్రభుత్వాలు, నాయకులు ప్లాంట్ మనుగడకోసం ఉదారంగా అందించే సాయాన్ని, కొందరు తమస్వార్థ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడంఎంతవరకు సబబో విజ్ఞులైన ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.“ అని మాజీమంత్రి ప్రత్తిపాటి ఒకప్రకటనలో హితవుపలికారు.

