గాజులరామారం పద్మశాలి సంఘం మరింత బలోపేతం

Sakshitha news

గాజులరామారం పద్మశాలి సంఘం మరింత బలోపేతం

*పద్మశాలి కుటుంబ సభ్యులకు పిలుపునిచ్చిన సంఘం నేతలు

*ఈనెల 19 న పద్మశాలి కార్తీకమాసం వనభోజనాలు… అందరూ రావాలని ఆహ్వానం…

సాక్షిత న్యూస్, కుత్బుల్లాపూర్:

రానున్న కాలం లో గాజులరామారం పద్మశాలి సంఘం మరింత బలోపేతం చేయడానికి పార్టీలకు అతీతంగా కృషి చేస్తామని పలువురు సంఘం నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం రోజున జరిగిన గాజులరామారం డివిజన్ పద్మశాలి సంఘం కుల బంధువుల సమావేశం గాజులరామారం డివిజన్లోని మల్లారెడ్డి నగర్ ఫేస్ 1 రోడ్ నెంబర్ 5 లో గల కస్తూరి బాలరాజు స్వగృహంలో జరిగింది. రాజకీయ పార్టీలకు అతీతంగా గాజులరామారం పద్మశాలి సంఘమును అభివృద్ధి చేయడానికి అందరు కృషి చేయాలని కోరారు. అన్ని పార్టీల సహకారంతో ముందుకు సాగాలని సభ్యులు సూచించారు.
ఈనెల 19 వ తేదీన గాజులరామారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసం వన భోజనాలు ఏర్పాటు చేయాలని సమావేశంలో తీర్మానించారు.
రానున్న కాలంలో మార్కండేయ భవనంతో పాటు మార్కండేయ ఆలయం ఏర్పాటుకు సంఘం ఆధ్వర్యంలో కృషి చేయాలని సభ్యులు సూచించారు. ఈనెల 19న పద్మశాలి కార్తీకమాసం వనభోజనాల కార్యాక్రమాన్ని పద్మశాలి కుల బంధువులందరు పాల్గొని విజయవంతం చేయాలనీ వారు కోరారు.

Scroll to Top