బీజేపీకి జేజేలు పలికిన బీహార్ ప్రజలు
** బీజేపీనేత నవీన్ కుమార్ రెడ్డి
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: బీహార్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి విజయ పరంపరను కొనసాగించిందని బీజేపీ సీనియర్ నేత పి.నవీన్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ బీహార్ ప్రజలకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ ను తలదన్నే విధంగా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ ఎన్డీఏ కూటమి పార్టీలను అఖండ మెజారిటీతో గెలిపించి భారతదేశానికి మోడీ నాయకత్వమే శ్రీరామరక్ష అని బీహార్ ప్రజలు నిరూపించారన్నారు.
దేశంలో మోడీ నాయకత్వంలోని ఎన్డిఏ కూటమి ప్రభంజనం జీవనదిలా కొనసాగుతూనే ఉంటుందన్నారు. బీహార్ ఎన్నికల అనూహ్య ఫలితాలు నరేంద్ర మోడీ సుపరిపాలనకు నిదర్శనం అని, బిజెపి ఒక రాజకీయ పార్టీ కాదని ఓ సమ్మోహన శక్తి అని ప్రతి భారతీయునిలో కలిగిందన్నారు. అలాగే దేశ ప్రగతిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత ఒక్క నరేంద్ర మోడీకే దక్కుతుందని ఆయన నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ప్రజల సౌభాగ్యం కోసం తీసుకుంటున్న ఆర్థిక సంస్కరణలతో, ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో అన్ని వర్గాల ప్రజల మన్ననలను పొందుతూ అన్ని రాష్ట్రాలలో “కాషాయం జెండా”ను రెపరెపలాడిస్తున్నదన్నారు.
మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని ప్రకటించిన “జీఎస్టీ” నిర్ణయం చారిత్రాత్మకమన్నారు.
భారతీయులందరికీ జీఎస్టీని సరళీకృతం చేయడంతో బీహార్ ప్రజలతో సహా రాబోవు రోజులలో జరిగే అన్ని దక్షిణాది రాష్ట్రాల ఎన్నికలలో కాషాయం జెండా కదం తొక్క బోతుందన్నారు. దేశం ప్రగతి పథంలో నడుస్తూ ప్రపంచంలోని అన్ని అగ్ర దేశాలతో సైతం పోటీ పడుతుందంటే కారణం నరేంద్ర మోడీ దేశ భక్తి,
దైవ భక్తి, దూరదృష్టి, రాజకీయ చతురతలే ప్రధాన కారణమని నవీన్ రెడ్డి కొనియాడారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
