టెక్కలిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, విద్యార్థులతో కలిసి భారీ నిరసన ర్యాలీ నిర్వహించిన ఇన్చార్జ్ పేరాడ తిలక్
వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు “టెక్కలి నియోజకవర్గం సమన్వయకర్త పేరాడ తిలక్” అధ్యర్యంలో “ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టెక్కలిలో వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహం నుండి అంబేద్కర్ జంక్షన్ వరకూ భారీ నిరసన ర్యాలీ చేస్తూ, నియోజకవర్గ పరిశీలకులు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారితో కలిసి టెక్కలి తహసీల్దార్, టెక్కలి ఆర్డిఓ కార్యాలయ సిబ్బందికి మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ ప్రక్రియను విరమించుకోవాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల జెడ్పీటీసీలు దువ్వాడ వాణి, పాల వసంతరెడ్డి, దుబ్బ వెంకటరావు, ఎంపీపీలు రోణంకి ఉమా మల్లయ్య, నడుపురు శ్రీరామ్మూర్తి,జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు అన్నెపు రామారావు, జిల్లా అధికార ప్రతినిధి సత్తారు సత్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి కూరమన బాలకృష్ణ, టెక్కలి మేజర్ పంచాయతీ సర్పంచ్ గొండెల సుజాత, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గురునాథ్ యాదవ్, రాష్ట్ర పంచాయతీరాజ్ ఉపాధ్యక్షులు నూక సత్యరాజు, రాష్ట్ర ఐటి విభాగం కార్యదర్శి కిల్లి అజయ్, యువజన విభాగం కార్యదర్శి కోత సతీష్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు అశోక చక్రవర్తి, నాయకులు హనుమంతు వెంకటేశ్వరరావు, సంపతిరావు హేమసుందర్ రాజు, బుడ్డ మోహన్ రెడ్డి, తమెరి రాజు, చిన్ని జోగారావు, ఆట్ల రాహుల్, బాగతి దివాకర్, జనార్ధన్ రెడ్డి, కవిటి రామరాజు, బొడ్డు వెంకటరమణ, కర్ణిక జీవన్, బడ్డ రాజేష్, బర్ల కార్తీక్ , నాలుగు మండలాల సర్పంచ్లు ఎంపీటీసీలు, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, విద్యార్థులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
