టీడీపీ ఆఫీస్ కు స్థలం మంజూరు పై హర్షం

Sakshitha news

టీడీపీ ఆఫీస్ కు స్థలం మంజూరు పై హర్షం

** తిరుపతి జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతిలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కార్యాలయానికి స్థలం మంజూరు పై తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు గొల్ల నరసింహ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. అన్న నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించినప్పటి నుంచి తిరుపతి అంటే ఎనలేని అభిమానం అని, ఏ సినిమా రిలీజ్ అయిన తిరుమల శ్రీవారి పాదాల తన సినిమా రీలు కు పూజ చేసిన తర్వాత రిలీజ్ చేసే వారని, అదే సంప్రదాయంగా పార్టీ స్థాపించినప్పుడు తిరుపతిలో బహిరంగ మీటింగు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎక్కడెక్కడ నుంచో తండోప తండాలుగా జనాలు వచ్చి మీటింగును భారీ సక్సెస్ చేయడం జరిగేదన్నారు. తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయితీ లెక్క ధాఖల సర్వే నెంబర్ 495/5, 495/11 రెండు ఎకరాలు స్థలాన్ని మంజూరు చేస్తూ క్యాబినెట్ మీటింగ్ లో ఆమోదించడం చాలా ఆనందదాయకమని అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి , విద్య – ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలిపారు. తిరుపతి జిల్లా లో ఏడు నియోజకవర్గాలకు కలిపి స్థలం మంజూరు చేసుకోవడం, భవనం తొందర్లోనే నిర్మించడం జరుగుతుందని, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి సులువుగా ఉంటుందని తెలియజేశారు.

Scroll to Top