బీసీ రిజర్వేషన్ లపై బంద్ కు సిపిఐ సంపూర్ణ మద్దత్తు.

Sakshitha news

బీసీ రిజర్వేషన్ లపై బంద్ కు సిపిఐ సంపూర్ణ మద్దత్తు.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.

 సాక్షిత :  బీసీ రిజర్వేషన్ లను అమలు చెయ్యాలని ప్రజలంతా కోరుతున్న సందర్భంలో బీసీ రిజర్వేషన్ లపై హైకోర్టు స్టే ఇవ్వడం తగదని వెంటనే రిజర్వేషన్ లను కల్పించాలని కోరుతూ ఈ నెల 18 నాడు బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన బంద్ లో సిపిఐ జిల్లా శ్రేణులన్నీ పాల్గొని జయప్రదం చెయ్యాలని సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ కోరారు.
    ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ లు అమలు చెయ్యాలని ప్రజలు రాష్ట్రాలు కోరుతుంటే బీజేపీ ప్రభుత్వం నిమ్మకనిరేతినట్లు వ్యవహారిస్తుందని అన్నారు,ఇప్పుడు బీజేపీ అసలు స్వరూపం బయటపడుతుందని అన్నారు. అగ్రవర్ణ కులాల వెనుకబడిన వారికీ ఏ రాష్ట్రం కానీ,ప్రజలు కానీ అడగలేదని,ఎక్కడా ధర్నాలు కానీ నిరసనలు జరగలేదని కానీ బీజేపీ ప్రభుత్వం 10 శాతం కూడా లేనివారికీ 10 శాతం రిజర్వేషన్ లు ఇచ్చి పార్లమెంట్ లో అమోదింప చేసుకొని సుప్రీమ్ కోర్టు విధించిన 50 శాతం పరిమితి కూడా మించిపోయిందని,ఇది బీజేపీ కి అగ్రవర్ణాలకు ఇచ్చే సహకారమని కానీ బీసీ లు అడిగితే మాత్రం చెయ్యట్లేదని ఇప్పటికైనా బీజేపీ నాటకాలు మానేసి బీసీ బిల్లును పార్లమెంట్ లో అమోదించాలని లేకపోతే బీసీ లు బీజేపీ ని రానున్న ఎన్నికల్లో తిరస్కరిస్తారని అన్నారు.

బీసీ రిజర్వేషన్ లు అమలు అయ్యేంత వరకు సిపిఐ కార్యకర్తలు పోరాటాలకు నాయకత్వం వహించాలని కోరారు.

Scroll to Top