ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం
- వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు
అమరావతి, : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ-ఫైళ్ల పరిష్కారంలో వరుసగా మూడోసారి మొదటి స్థానంలో నిలిచి తన పనితీరును చాటుకున్నారు. అత్యంత వేగంగానే కాకుండా పారదర్శకంగా, సమర్థవంతంగా ఫైళ్లను పరిష్కరిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. ఫైళ్ల పరిష్కారంలో వేగంతో పాటు స్పష్టత, పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యత ఇస్తూ మంత్రి అచ్చెన్నాయుడు ముందుకు సాగుతున్నారని సీఎం ప్రశంసించారు.
ప్రభుత్వ పరిపాలనలో జాప్యాన్ని తగ్గిస్తూ, నిర్ణయాలను వేగంగా తీసుకోవడంలో ఈ-ఫైలింగ్ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో వరుసగా మూడోసారి మొదటి స్థానాన్ని సాధించడం మంత్రి అచ్చెన్నాయుడు పనితీరుకు నిదర్శనమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గంటల వ్యవధిలోనే ఫైళ్లను పరిశీలించి పరిష్కరించడం ద్వారా మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేకతను చాటుతున్నారని అభినందించారు. పారదర్శకత, వేగం, సమర్థతకు పెద్దపీట వేస్తూ మంత్రి అచ్చెన్నాయుడు కొనసాగిస్తున్న పనితీరు ఇతర శాఖలకు కూడా ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST