విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరికీ శుభం కలగాలి:: మాజీ ఎమ్మెల్సీ వై వి బి రాజేంద్ర ప్రసాద్

Sakshitha news

విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరికీ శుభం కలగాలి:: మాజీ ఎమ్మెల్సీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ .

ఉయ్యూరు పదవ వార్డులో కొబ్బరి తోట యువత ఆధ్వర్యంలో నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలలో తొలి ఘట్టమైన వినాయకుని ఆగమనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్సీ వై.వి. బి. రాజేంద్ర ప్రసాద్ పాల్గొని గణేశుని విగ్రహాన్ని ఆవిష్కరించి, పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ…..

వినాయకుడు జ్ఞానానికి, శక్తికి, విజయానికి ప్రతీక అని మనం ఏ కార్యక్రమం ప్రారంభించినా వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయమని అన్నారు.

వినాయకుని ఆశీస్సులతో మన ఉయ్యూరు టౌను మరియు కొబ్బరి తోట ప్రాంతం అభివృద్ధి చెందాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ఆనందోత్సాహాలతో, సంతోషంగా ఉండాలని , ఉయ్యూరు ప్రజలందరికీ మంచి జరగాలని రాజేంద్రప్రసాద్ ఆకాంక్షించారు…

ఈ కార్యక్రమంలో వార్డు మాజీ కౌన్సిలర్ పల్యాల శ్రీనివాసరావు, పలీయాల రమేష్, సయ్యద్ అజ్మతుల్లా, ఆకుల పండు, బొబ్బిలి పూర్ణ, ఈశ్వర్, అనిల్, రాఘవ, చరణ్, సాయి, గౌరీ. తదితరులు పాల్గొన్నారు.