ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించిన అశ్వారావుపేట బిఆర్ఎస్ నాయకులు

Sakshitha news

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించిన అశ్వారావుపేట బిఆర్ఎస్ నాయకులు

నేటి బాలలే రేపటి పౌరులు జూపల్లి.రమణ రావు

విద్యార్థులు ప్రయోజకులుగా మారితే అదే ఉపాధ్యాయులకు విద్యార్థులు ఇచ్చే పెద్ద బహుమతి మాజీ ఎంపీపీ జల్లిపల్లి.శ్రీరామమూర్తి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అశ్వారావుపేట లోని జవహర్ విద్యాలయం, గౌతమి స్కూల్,సూర్య స్కూల్,వికెడివిఎస్ రాజు జూనియర్ కళాశాల లోని ఉపాధ్యాయులను అశ్వారావుపేట మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా శాలువాతో సన్మానించి జ్ఞాపికలను అందజేయటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు భావి తరాలకు స్పూర్తిగా ప్రతి ఒక్క విద్యార్థిని రేపటి పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర పోషిస్తారని,ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఎక్కువ గా సంతోష పడేది ఆయన చదువు చెప్పిన విద్యార్థి ప్రయోజకుడైనప్పుడే ఎక్కువ సంతోష పడతారని,ప్రతి ఒక్కరూ కూడా ఉపాధ్యాయులు చెప్పే ప్రతి ఒక్క మాటలను,పాటాలను క్రమశిక్షణతో పాటిస్తూ, చదువును కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి మీ తల్లిదండ్రులకు,ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకు నేటి బాలలే రేపటి పౌరులని శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఆశయాలను మీరంతా పాటించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ జూపల్లి రమణారావు,మాజీ ఎంపీపీ జల్లిపల్లి.శ్రీరామమూర్తి, జిల్లా అధికార ప్రతినిధి యూఎస్ ప్రకాష్ రావు, మాజీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సంక.ప్రసాద్,మండల నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి,మాజీ సొసైటీ డైరెక్టర్ కలపాల బాబురావు, మాజీ మల్లాయిగూడేం సర్పంచ్ నారం.రాజశేఖర్,చిప్పనపల్లి శ్రీను,బన్ను,అమీర్,వంశీ,అంజి, బబ్లూ తదితరులు పాల్గొన్నారు.