కోదాడలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
సాక్షిత
సూర్యాపేట జిల్లా/ కోదాడ పట్టణంలోని కేఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల క్రీడా మైదానంలో, క్రీడాకారుల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను 7వ వార్డు జనసేన పార్టీ కంటెస్టెంట్ అభ్యర్థి డ్రైవర్ కాలని మారోజు తిరుమల చారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు. అనంతరం తిరుమల చారి మాట్లాడుతూ… దేశ పరిరక్షణ, తెలుగు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి, భావితరాలకు భరోసానిచ్చే జీరో బడ్జెట్ రాజకీయ వ్యవస్థ కోసం పవన్ కళ్యాణ్ జనసేనను స్థాపించారని, గెలుపోటములతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజాసేవకే అంకితమైన ఆయన ఆశయ సాధనకు జనసైనికులు కట్టుబడి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రజా సంక్షేమం, యువత భవిష్యత్తు కోసం కులమతాలకు అతీతంగా జనసేన పార్టీ ప్రజాసేవలో ముందుంటుందని, రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగి పార్టీ తన ప్రభావాన్ని చాటుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST