పేదల మనిషి వైయస్సార్. – జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు..*
సాక్షిత : సూర్యాపేట జిల్లా/కోదాడ 11వ వార్డులో వార్డు కౌన్సిలర్ మరియు కోదాడ మున్సిపల్ వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లీశ్వరి నాగిరెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ 17వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు కోదాడ మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు లు పాల్గొని వైయస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైయస్సార్ మహా జననేత అని, ప్రతి పేద ఇంటి గడపలో వైయస్సార్ ఉంటాడని ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రెండు రూపాయల కిలో బియ్యం, ఇలా అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినా చిరస్మరణీయుడు వైయస్సార్ అని కొనియాడారు,. ఈ కార్యక్రమంలో కొమరబండ మత్య్స సహకార సంఘ చైర్మన్ దేవపంగు వెంకటి, కాంగ్రెస్ నాయకులు కోసూరి బద్రి గౌడ్, కర్లపూడి బాలకృష్ణ, తమలపాకుల లక్ష్మీనారాయణ, రామకృష్ణ, దేవపంగ వెంకటి, బచ్చలకూరి వెంకటేశ్వర్లు, దాసరి నరసయ్య, బాలస్వామి, డాక్టర్ శ్రీను, శంకర్, శ్రీకాంత్, చార్లీ, పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST