ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే వ్యక్తి రాజశేఖర్ రెడ్డి
డాక్టర్.వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి
ఘనంగా నివాళులర్పించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పై ఘాటుగా స్పందించిన ప్రసన్న
దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్. వై.యస్. రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా కోవూరు మండలంలోని మైధిలి హాల్ సెంటర్ వద్ద ఉన్న వై.యస్.ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి.అనంతరం కోవూరు మండల పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న ప్రసన్నకుమార్ రెడ్డి. అనంతరం వారు మాట్లాడుతూ .. ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉండే ముఖ్యమంత్రివర్యులు మన డాక్టర్. వై.యస్ రాజశేఖర్ రెడ్డి అని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ప్రదాత అని అన్నారు.
“అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు” జిల్లాలో అక్రమ మైనింగ్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సాక్షాలతో బయటపెట్టారని దానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమాధానం చెప్పలేదని మీ ఇంట్లో పనిచేసే వారి చేత ప్రెస్ మీట్ లు పెట్టించడం సరికాదని వారు అన్నారు. ఈ ఆరోపణలపై మాజీ మంత్రి అనిల్ నేను మీరు తేల్చుకుందామని వారు అన్నారు. మా దగ్గర ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయని వారు తెలిపారు. రాజకీయ అనుభవం లేని మీకు జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా మిమ్మల్ని తీసుకొచ్చారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరి చలపతిరావు, కొండూరు అనిల్ బాబు, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, శివుని నరసింహులు రెడ్డి, నలుబోలు సుబ్బారెడ్డి, అత్తిపల్లి అనూప్ రెడ్డి, గాజుల మల్లికార్జునరావు, మీరా రెడ్డి, హరి ప్రసాద్ రెడ్డి, గున్నం జనార్ధన్, తోడేటి మహేష్, చిరంజీవి, కవగిరి శ్రీలత, యేడం లక్ష్మి కుమారి, కూట్ల ఉమా శ్రీనివాసరావు, జెట్టి శ్రీనివాసులు రెడ్డి, కవగిరి ప్రసాద్, సరాబు సుధీర్ కుమార్, మరియు నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST