కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమైన మెద్చల్–మల్కాజిగిరి అర్బన్ బీజేపీ కార్యాలయం

Sakshitha news

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమైన మెద్చల్–మల్కాజిగిరి అర్బన్ బీజేపీ కార్యాలయం

కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మెద్చల్–మల్కాజిగిరి అర్బన్ భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఘనంగా ప్రారంభమైంది. శ్రీ డి. గిరివర్ధన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు , మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ , డా. ఎస్. మల్లారెడ్డి హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా నాయకులు, వివిధ మోర్చాల నాయకులు, డివిజన్ అధ్యక్షులు, బీజేపీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సెల్ కో-కన్వీనర్, గాజులరామారం డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీ రావుల శేషగిరి ఆధ్వర్యంలో ఆయన తనయుడు, BJYM నాయకులు శ్రీ రావుల పృద్వి కార్యక్రమంలో పాల్గొని, నూతన బాధ్యతలు స్వీకరించిన మెద్చల్–మల్కాజిగిరి అర్బన్ బీజేపీ అధ్యక్షులు శ్రీ డి. గిరివర్ధన్ రెడ్డి ని కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రావుల రిషింద్ర సాగర్, గడ్డమీది భరత్ కుమార్, గుజ్జ సందీప్, మంజునాథ్, రామారావు, శివ తదితర సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.