ఉయ్యూరు మున్సిపాలిటీలో డయేరియా కలకలం – బాధితులను ఇంటింటికి వెళ్లి పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే బోడె ప్రసాద్
ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలోని 7 వ వార్డుల్లో డయేరియా వ్యాప్తి చెందడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నందున ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ స్థానిక కాపుల రామాలయం వద్ద ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంపు ని సందర్శించి, ఇంటింటికి వెళ్లి బాధితులను పరామర్శించడం జరిగినది.
పిదప వివిధ శాఖల అధికారులతో కాపు కళ్యాణ మండపంలో డయేరియా అదుపు గురించి శానిటేషన్ పనులు గురించి రివ్యూ మీటింగ్ ని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ నిర్వహించి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు..
తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ ,బోడె ప్రసాద్ మాట్లాడుతూ…
“ఉయ్యూరులో డయేరియా వ్యాప్తిపై ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉంది. వైద్య, మున్సిపల్, RWS అధికారులందరినీ అలర్ట్ చేశాం. ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి, ఇంటింటికీ క్లోరిన్ టాబ్లెట్లు, పంపిణీ చేస్తున్నాం. తాగునీటి పైప్ లైన్ లను పరిశీలించామన, నీటి నమూనాలను ల్యాబ్ కు పంపామని,రిపోర్ట్ రాగానే శాశ్వత పరిష్కారం చూపుతామని,ప్రజలెవ్వరూ భయాందోళన చెందవద్దు, ప్రభుత్వం మీకు అండగా ఉంది” అని భరోసా ఇచ్చారు.
ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్, తహశీల్దార్, వైద్యాధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
