“స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

Sakshitha news

“స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత..

క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ 20 -47 చంద్రబాబు విజన్ లో భాగం..

ఖాజానగల్లో మహిళల వ్యాయామం కోసం పార్కు నిర్మిస్తాం..

ఇంటి శుభ్రత తో పాటు పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని, ప్రతి మహిళ పరిసరాల పరిశుభ్రత కు ముందుకు రావాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. శనివారం బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ పరిధిలోని కాజా నగర్ లో స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఇంటి శుభ్రత తో పాటు పరిసరాల పరిశుభ్రతను కూడా బాధ్యతగా తీసుకొని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మహిళలు ముందుకు వస్తే వారి ప్రోత్సాహంతో పౌరులు యువత పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2047 విజన్ లో స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర భాగమని, చెత్త నుండి సంపద సృష్టించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి పని చేస్తున్నాడని ఆమె అన్నారు. ఖాజా నగర్ లో ఉర్దూ పాఠశాల అభివృద్ధికి స్థానిక మహిళలు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకురాగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.

అలాగే స్థానికంగా పార్కు లేక ఇబ్బంది పడుతున్నారని తమ దృష్టికి తీసుకురావడంతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా త్వరలో మహిళల వ్యాయామం కొరకు పార్కును నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అలాగే గత ప్రభుత్వంలో బుచ్చిరెడ్డిపాలెం లో మున్సిపల్ భవనం నిర్మాణం కొరకు 2 కోట్ల నిధులు మంజూరు అయితే దుర్వినియోగం చేశారని ఈ ప్రభుత్వంలో నాలుగు కోట్లతో భవనాన్ని పూర్తిచేసి అన్ని సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. రానున్న రోజుల్లో బుచ్చిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బుచ్చి చైర్ పర్సన్ మోర్ల సుప్రజ, బుచ్చి మండల అధ్యక్షులు గుప్తా శ్రీనివాసరావు, కోడూరు కమలాకర్ రెడ్డి, బుచ్చి కమిషనర్ ఇనుముల చిన్నబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

Scroll to Top