ఉషోదయ కాలనీలో రూ.42.50 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

Sakshitha news

ఉషోదయ కాలనీలో రూ.42.50 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌

కుత్బుల్లాపూర్: గాజులరామారం డివిజన్ పరిధిలోని ఉషోదయ కాలనీలో రూ.42 లక్షల 50 వేల వ్యయంతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఉషోదయ కాలనీకి మంజీరా నీటి సరఫరాను మంజూరు చేయించి, కాలనీవాసులకు తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసి కృషి చేయాలని ఆయన సూచించారు.

కాలనీవాసులు తమ ప్రాంతంలోని సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే, సంబంధిత అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లి వాటి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం ఉషోదయ కాలనీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో కూన శ్రీశైలం గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు శాలువాతో కూన శ్రీశైలం గౌడ్‌ కి ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజిగిరి డీసీసీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ , స్థానిక డివిజన్ అధ్యక్షుడు ఆంజనేయులు ముదిరాజ్, ఉషోదయ కాలనీ వాసులు నరసింహారెడ్డి, సురేందర్ రెడ్డి, గురు ప్రసాద్, వెంకట్ రెడ్డి, కృష్ణారెడ్డి, విజయ్ కుమార్, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, మహేశ్వర్ రెడ్డి, రమేష్, వీరన్న గౌడ, కోటేశ్వరరావు, యాదగిరి, ధూళిపాల శ్రీనివాసరావు, సోమశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top