శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నరేందర్ యాదవ్ సతీమణి,

Sakshitha news

శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నరేందర్ యాదవ్ సతీమణి, దివంగత కీర్తిశేషులు రాగం సుజాత యాదవ్ దశదినకర్మ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా సుజాత యాదవ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాగం నరేందర్ యాదవ్ తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

అదేవిధంగా జగద్గిరిగుట్టకు చెందిన మహేందర్ తండ్రి ఇటీవల మృతి చెందడంతో, వారి నివాసానికి వెళ్లిన కూన శ్రీశైలం గౌడ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు

Scroll to Top