ఇచ్చిన హామీలను అమలు చేస్తే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం….
తన ప్రాణాలకు రేవంత్‌రెడ్డిదే బాధ్యత…
బాసు హనుమంతు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న…
BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్
మాజీ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్
గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్,మాజీ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ పాల్గొన్నారు….
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….
పెండింగ్ ప్రాజెక్టులపై….
గద్వాల నియోజకవర్గంలో ర్యాలంపాడు,గట్టు ఎత్తిపోతల పథకం, నెట్టంపాడు ప్రాజెక్టు లు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులు కానీ,కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక,ప్రాజెక్టులపై ఉన్న మిగతా పెండింగ్ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయని విమర్శించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న గద్వాల పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టుల పరిస్థితిపై ఎందుకు సమాధానం చెప్పలేదని మండిపడ్డారు..కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చిన్న కాలువలో చెట్ల వెలిసిన తొలగించని స్థితిలో ప్రభుత్వము ఉన్నదని విమర్శించారు..గద్వాల ప్రజల సాగు,తాగునీటి అవసరాలకు కీలకమైన ప్రాజెక్టుల పనులు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయని,వాటి పూర్తి కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు…
విద్య వ్యవస్థ పై….
తెలంగాణ గురుకుల పాఠశాలల్లో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న కుంభకోణాలపై బీఆర్ఎస్ రాజీలేని పోరాటం చేస్తోందని పేర్కొన్నారు. ఈ పోరాటం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం విద్యార్థులకు న్యాయం జరగాలన్నదేనని ఆయన తెలిపారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే విద్యార్థులకు అవసరమైన నాణ్యమైన యూనిఫాంలు,పుస్తకాలు,ఇతర సామగ్రి అందించేవారని, నాసిరకం వస్తువులకు ఎలాంటి అవకాశం ఉండేదికాదని అన్నారు.ప్రస్తుతం కూడా గురుకుల విద్యార్థులందరికీ నాణ్యమైన వస్తువులు పారదర్శకంగా అందాలని, వారి భవిష్యత్తుతో ఎవరూ రాజీ పడకూడదన్నదే బీఆర్ఎస్ లక్ష్యమని స్పష్టం చేశారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తెలిపారు.
తన భద్రత తొలగింపు పై….
రాష్ట్ర ప్రభుత్వం తన భద్రతను తగ్గించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తానేమీ రాజకీయ లబ్ధి కోసం వచ్చిన వ్యక్తిని కాదని, 26 ఏండ్లు ఐపీఎస్ అధికారిగా దేశం కోసం ప్రాణాలు పణంగాపెట్టి పనిచేశానని, తనకు రాష్ట్రపతి శౌర్యపతకం కూడా వచ్చిందని గుర్తుచేశారు. తాను కాంగ్రెస్, టీడీపీ, బీఆర్‌ఎస్ హయాంలో ఆఫీసర్‌గా పనిచేశానని, ఏ ప్రభుత్వం కూడా తన భద్రతను తగ్గించలేదు కానీ, ఇప్పుడు కక్షపూరితంగా తన భద్రతను తగ్గించారని మండిపడ్డారు…నిత్యం ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నందుకే తనపై కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధిస్తున్నదని ఆరోపించారు. తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే తన వ్యక్తిగత భద్రతను కుదించిందని మండిపడ్డారు. తన సెక్యూరిటీని తొలగించినా, తనను బెదిరించినా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆపబోనని, ఎట్టిపరిస్థితుల్లోనూ బీఆర్‌ఎస్‌ను వీడనని స్పష్టంచేశారు…..తన ప్రాణాలకు రేవంత్‌రెడ్డిదే బాధ్యతని హెచ్చరించారు….
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పద్మ వెంకటేశ్వర రెడ్డి,నాగర్ దొడ్డి వెంకట్రాములు, జి.రాఘవేంద్ర రెడ్డి, అంగడి బసవరాజ్, ఆతుకూరి రెహమాన్,కౌన్సిలర్ చంటన్న, కురవ పల్లయ్య,చిన్నపాడు ఆంజనేయులు,మోనేష్, గంజిపేట రాజు,చక్రిధర్ రెడ్డి,ఆటో టవర్ ముక్బాల్,తిమ్మప్ప గౌడ్,వెంకటేష్ నాయుడు, నూర్ పాషా, శ్రీరాములు, ముని మౌర్య,ఇద్దుం గోవిందు,కావాలి గోపి,గాజుల కృష్ణారెడ్డి,డ్యామ్ శ్రీను, సామెలు,ఇంజన్న,మాలిక్,రాము, రమేష్,తిమ్మప్ప,కృష్ణ,మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు…..

