కరెంటు షాక్తో మృతి చెందిన కుటుంబానికి అండగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్…
సాక్షిత పెద్దపల్లి //జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి,
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామానికి చెందిన కట్ట అశోక్ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై చికిత్స పొందుతూ హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో ధర్మపురి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తన వ్యక్తిగత సహాయంగా రూ.20 వేల ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రమాదవశాత్తు కరెంటు షాక్కు గురై మృతి చెందిన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, ఎలాంటి సమస్య వచ్చినా తాను అందుబాటులో ఉంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నందిమేడారం గ్రామ సర్పంచ్ వీరుపాల్, ఉపసర్పంచ్ అరిగె రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
