నిరుద్యోగ యువతకు శుభవార్త….
స్వతంత్ర మైక్రో ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగాల భర్తీకి జూన్ 19న జాబ్ మేళా…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి, జిల్లాలోని నిరుద్యోగ యువతకు స్వతంత్ర మైక్రో ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 19వ. తేదీ శుక్రవారం జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం. రాజశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
స్వతంత్ర మైక్రో ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మొత్తం 40 ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు బైక్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు అర్హులని, అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలని తెలిపారు.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.14 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనంతో పాటు రూ.6 వేల వరకు ప్రోత్సాహకాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఎంపికైన వారు సుల్తానాబాద్, చెన్నూరు, మంథని, జగిత్యాల, మెట్పల్లి, నిర్మల్, భూపాలపల్లి, లక్ష్మీపేట ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 19న ఉదయం 11 గంటలకు సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, అప్‌డేటెడ్ బయోడేటా లేదా రెజ్యూమే, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీతో పాటు అనుభవం ఉంటే ఎక్స్‌పీరియన్స్ లెటర్ తీసుకొని రూమ్ నెంబర్-233, మొదటి అంతస్తు, జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం, పెద్దపల్లిలో హాజరై తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.
మరిన్ని వివరాలకు 8985336947, 8121262441 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని జిల్లా ఉపాధి అధికారి ఆ ప్రకటనలో తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
