అంబేద్కర్ కాలనీ సమస్యల పరిష్కారానికి ముందడుగు… ప్రజల్లో ఆనందం …
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:ఎన్టీపీసీ, ఎన్టీపీసీ పరిధిలోని 32వ డివిజన్ అంబేద్కర్ కాలనీని మార్నింగ్ వాక్ కార్యక్రమానికి ఎంపిక చేయడం పట్ల కాలనీ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. అంబేద్కర్ కాలనీ ఆవిర్భావం నుంచి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు అందించినా సరైన స్పందన రాలేదని స్థానికులు తెలిపారు.
ఈ నేపథ్యంలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, ఇన్‌చార్జి కలెక్టర్ అరుణ శ్రీ, డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, 32వ.డివిజన్ కార్పొరేటర్ తోట మమత కుమారస్వామి అంబేద్కర్ కాలనీని సందర్శించి స్థానిక సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా రోడ్లపై నెలలుగా పడిపోయి ఉన్న చెట్లను తొలగించడంతో పాటు డ్రైనేజీల్లో పేరుకుపోయిన మట్టిని జేసీబీ సహాయంతో తొలగించారు. అలాగే పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
కాలనీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నందుకు కృతజ్ఞతగా మేయర్ మహంకాళి స్వామికి అంబేద్కర్ చిత్రపటాన్ని స్థానికులు బహుకరించారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పెగడపల్లి భవాని నారాయణ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆసిఫ్ పాషా, కార్పొరేటర్ వెంగళబాబు, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముచకుర్తి రమేష్, విశ్వభారతి విద్యాసంస్థల చైర్మన్ బంగారపు యాదగిరి గౌడ్, అభిషేక్, దాసరి ఆనంద్, పెగడపల్లి సంతోష్, రత్నం కరుణాకర్, అంబేద్కర్ కాలనీ ప్రజలు, ఎన్టీపీసీ పట్టణ సూపర్వైజర్ సూర్య, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
