కళ్యాణ లక్ష్మి చెక్కులతో పేద కుటుంబాల్లో ఆనందం…
లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన కార్పొరేటర్ విజయ -మల్లేష్…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం,
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ. డివిజన్‌కు చెందిన పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి పథకం చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు, నగర మేయర్ మహంకాళి స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 1వ డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా తారా సింగ్ లక్ష్మి, కుంభం వినోద, గండ్ర పద్మ, దేదావత్ శారద, మాటేటి వీరలక్ష్మి కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ మాట్లాడుతూ, నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల వివాహాలు నిర్వహించడం ఆర్థికంగా భారంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. ముఖ్యంగా పేద కుటుంబాలకు ఈ పథకం ఆర్థిక భరోసా కల్పిస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపుతోందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌లకు లబ్ధిదారుల కుటుంబాల తరఫున, అలాగే 1వ డివిజన్ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
