మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ & జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ సర్కిల్ బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ &మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి BRS పార్టీ నాయకుడు చామాకురా మహేందర్ రెడ్డి హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయడం, అలాగే SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సమిష్టిగా ముందుకు సాగాలని రాగిడి లక్ష్మారెడ్డి నాయకులు పిలుపునిచ్చారు.
సభ్యత్వ రుసుములు: సాధారణ సభ్యత్వం – రూ.10/- క్రియాశీలక సభ్యత్వం – రూ.50/-
ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు.
రాబోయే రోజుల్లో బి ఆర్ ఎస్ పార్టీని మరింత బలపర్చేందుకు కార్యకర్తలందరూ ఐక్యంగా పనిచేయాలని నాయకులు సూచించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మున్సిపల్/ డివిజన్/వార్డు అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్ళు, యువజన విభాగం నాయకులు – సభ్యులు, పార్టీ వివిధ అనుబంధ సంఘాల నాయకులు – సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

