శివనామ స్మరణతో మారుమ్రోగిన కాశీ విశ్వేశ్వర దేవాలయం

Sakshitha news

శివనామ స్మరణతో మారుమ్రోగిన కాశీ విశ్వేశ్వర దేవాలయం

సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలోని చందుపట్ల గ్రామం శ్రీ శివరామ క్షేత్రంలో ఆదివారం పౌర్ణమి సందర్భంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి 21 కేజీల విభూదితో భాస్మాభిషేకాన్ని ఆలయ అర్చకులు ముడుంభై రఘువరన్ ఆచార్యులు ఘనంగా నిర్వహించారు. ఉదయం పంచామృత అభిషేకం తదుపరి పంచ వర్ణాభిషేకం నిర్వహించి అనంతరం ప్రత్యేక గజమాలతో స్వామివారిని అలంకరించారు.శివ నామ స్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.ఈ కార్యక్రమంలో భక్తులు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Scroll to Top