కార్మిక హక్కుల పరిరక్షణలో సీఐటీయూ పాత్ర కీలకం…
56వ సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహింపు….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం,
56వ సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఎన్టీపీసీ ప్లాంట్ గేట్-2 కమాన్ వద్ద సీఐటీయూ అనుబంధ రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సీఐటీయూ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. యూనియన్ అధ్యక్షుడు ఎండి యాకూబ్ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం యూనియన్ ప్రధాన కార్యదర్శి గీట్ల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కార్మిక వర్గ హక్కులు, సంక్షేమం కోసం సీఐటీయూ నిరంతరం పోరాటం చేస్తోందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఐక్య ఉద్యమాల ద్వారా అనేక పోరాటాలు నిర్మించిన ఘనత సీఐటీయూకు దక్కిందని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా కార్మిక ఉద్యమాలకు సీఐటీయూ అండగా నిలుస్తూ 56 సంవత్సరాలుగా కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
అలాగే ఎన్టీపీసీ యాజమాన్యం పోలీసు ధ్రువీకరణ, వైద్య పరీక్షల పేరుతో కార్మికులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు.
కొత్త కొత్త ఉత్తర్వులు జారీ చేస్తూ కార్మికుల్లో భయాందోళనలు సృష్టిస్తోందని విమర్శించారు. కార్మికులకు ఇబ్బందులు కలిగించే విధానాలను, ఇటీవల జారీ చేసిన సంబంధిత ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు దండ రాఘవరెడ్డి, కాదాసీ మల్లేష్, కే. రాజ్‌కుమార్, తోట రవీందర్, ఏ. రమేష్, ఎండి షమీం, ఏ. చంద్రమౌళి, డి. రాజయ్య, గణపతి, విజయ్, లెక్కల దేవేందర్ రెడ్డి, రామస్వామి, ఉమర్, కనకయ్య, రహమత్ అలీ తదితరులు పాల్గొన్నారు.

