ప్రగతిశీల భారత నిర్మాణమే రాజీవ్ గాంధీకి నిజమైన నివాళి
ఐటీ రంగానికి రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం
డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు
సాక్షిత వనపర్తి :
మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రం రాజీవ్ చౌక్ లోరాజీవ్ గాంధీ విగ్రహానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పూల మాల వేసి , దేశానికి ఆయన చేసిన త్యాగాలను, సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు.
చిన్నారెడ్డి మాట్లాడుతూ
దేశ సమగ్రత, శాంతి, ప్రజాస్వామ్య విలువలు పరిరక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని అన్నారు.
యువతకు ఓటు హక్కు కల్పించడంతో పాటు ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసి భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన మహోన్నత నాయకుడు రాజీవ్ గాంధీ అని తెలిపారు.
రాజీవ్ గాంధీ హయాంలో గ్రామపంచాయతీలకు అన్ని హక్కులు కల్పిస్తూ పల్లెలు, తాండాలు అభివృద్ధి జరిగే విధంగా కృషి చేశారని అన్నారు.
దేశంలోని ప్రముఖ ప్రభుత్వ విభాగాల్లో కంప్యూటర్ల వినియోగాన్ని ప్రారంభించిన తొలి నాయకుడు రాజీవ్ గాంధీ అని దాని ఫలితంగా టెలికాం , బ్యాంకింగ్, విద్యా రంగాలలో ఆధునీకరణ మొదలైంది అని అన్నారు.
రాజీవ్ గాంధీ వర్ధంతిని దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా పాటిస్తున్న సందర్భంగా ప్రతి భారతీయుడు హింసకు వ్యతిరేకంగా , శాంతి సామరస్యం సౌబ్రతృత్యత్వాని పరిరక్షించాలని అన్నారు.
సమైక్యతే మన శక్తి శాంతియుత భారతమే మన లక్ష్యం అని దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని చిన్నారెడ్డి పిలుపునిచ్చారు.
దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు విఫలం అయ్యారని,దేశ ప్రజలకు ప్రత్యామ్నాయ ఆశగా రాహుల్ గాంధీ ఎదుగుతున్నారని, రానున్న రోజుల్లో ఆయన దేశ ప్రధానమంత్రి కావడం ఖాయమని చిన్నారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య , వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీమాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు తిరుపతయ్య, వనపర్తి జిల్లా ప్లీడర్ కిరణ్ కుమార్ , వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్,జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీ బ్రహ్మం, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కోళ్ల వెంకటేష్, వనపర్తి సింగల్ విండో మాజీ అధ్యక్షులు సహదేవుడు, వనపర్తి జిల్లా ఏఐపిసి అధ్యక్షుడు నాగార్జున,వనపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి బాబా, వనపర్తి మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారాయణ, కౌన్సిలర్ పీతంబర్ నాయక్ ,వనపర్తి మండల్ NSUI అధ్యక్షుడు ఎత్తం చరణ్ రాజ్, సీనియర్ నాయకులు పాండు రావు, యాదగిరి, నందిమల్ల రాము,ద్వారపోగు విజయ్ బాబు,ఎంట్ల రవి, శివశంకర్, బాల్ రాజు, చెన్నయ్య, శ్రీనివాస్ రెడ్డి, కమ్మర్ రెహమాన్, బొట్టు శీను,రాములు, శ్రీనివాస్, పెద్దమందడి మండల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు,కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

