వర్చువల్ గా మహానాడు

Sakshitha news

వర్చువల్ గా మహానాడు

సాక్షిత : సీ.యం అడుగుజాడల్లో నడుద్దాం- కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

నెల్లూరు జిల్లా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకు దేశవ్యాప్తంగా పొదుపు చర్యలు చేపట్టాలి అనే ఒక్కో ఒక్క ఉద్దేశంతో ప్రధాని అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చారని,..మన రాష్ట్రం నుంచే పొదుపు ఉద్యమం మొదలు అవ్వాలి అనే ఆలోచన చాలా గొప్పదిని కోవూరు శాసన సభ్యులువేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు.. నెల్లూరు నగరం లోనిఎమ్మెల్యే కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు…ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశం లో కాని రాష్ట్రం లో కాని సంక్షోభం ఏర్పడుతుందని ఆలోచన వస్తే ఆ సంక్షోభం నుండి రాష్ట్రాన్ని కాపాడుకునే పరిస్థితి లో ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరి, మొట్ట మొదటిగా స్పందించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ని,ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు.

ప్రస్తుత తరుణంలో దేశం లో జరుగుతున్న అనేక పరిస్థితులను రాబోయె సంక్షోభాన్ని గుర్తించిన ప్రధాని నరేంద్ర మోడీ ముందస్తు గా ప్రజా ప్రయోజనాల కోసం దేశ అభివృద్ధి కోసం తీసుకున్న ముందుస్తు పొదుపు చర్యలు చేయాలి అనే ఆలోచనా విధానం మన దేశానికి ఎంత గానో ఉపయోగం అన్నారు..మన రాష్ట్ర ఉపయోగాలను మన రాష్ట్ర అభివృదే లక్ష్యం గా పనిచేసే మన సీఎం నారా చంద్ర బాబు నాయుడు ఎప్పుడు దేశానికి ఆదర్శం గా నిలవటం లో ముందుంటారు అని ఈ సందర్భంగాతెలియజేసారు.రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం అనేక విషయాలని దృష్టిలో పెట్టుకొని పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో వర్చువల్ గా చేయాలి అని నిర్ణయం తీసుకోవటం ముఖ్యమంత్రి దార్శనికత స్పష్టంగా తెలియజేస్తుందన్నారు… చెప్పడమే కాదు ఆచరించడం కూడా సీఎం గొప్పతనం అన్నారు..

నెల్లూరు జిల్లా కొవూరు నియోజకవర్గంలో మహానాడు నిర్వహించాలి అని నిర్ణయం తీసుకున్న తర్వాత పసుపు పండుగ చేసే బాగ్యం మాకు దక్కినందుకు జిల్లా నాయకులు అందరం చాలా సంతోషించామన్నారు..ఐనప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సీఎం తీసుకున్న నిర్ణయాన్ని తాము అందరం పాటిస్తున్నామన్నారు..పొదుపు చర్యలో భాగంగా మహానాడు ను హైబ్రిడ్ పద్ధతిలో పొదుపు మహానాడు గా జరపాలని మన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మైన తాము అంతా ఏకీభవిస్తున్నామన్నారు.

Scroll to Top