కొమరవల్లిపాడులో ఘనంగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి 16 రోజుల పండుగ పాల్గొన్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు

Sakshitha news

కొమరవల్లిపాడులో ఘనంగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి 16 రోజుల పండుగ పాల్గొన్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు

సాక్షిత
చిలకలూరిపేట: పట్టణంలోని కొమరవల్లిపాడులో వెలసిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 3వ తేదీతో ముగిసిన నేపథ్యంలో, తాజాగా 16 రోజుల పండుగను ఆలయ కమిటీ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన భక్తులకు అన్నప్రసాద వితరణను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.

Scroll to Top