వైసీపీ బి ఎల్ ఏ లపై సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రసన్న కుమార్ రెడ్డి.
సాక్షిత : నెల్లూరు జిల్లా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షులు, వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నేడు మాజీ మంత్రి, వైసీపీ (పి ఎ సి) సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నెల్లూరు లోని వారి నివాసంలో కోవూరు నియోజకవర్గ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీల (బి ఎల్ ఏ) లకి సంబంధించిన సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో.వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతి రావు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు శివుని నరసింహులు రెడ్డి,కోవూరు మండల పార్టీ అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి, ఇందుకూరుపేట మండల పార్టీ అధ్యక్షులు మవులూరు శ్రీనివాసులురెడ్డి, బుచ్చి రూరల్ పార్టీ అధ్యక్షులు చెర్లో సతీష్ రెడ్డి, బుచ్చి మున్సిపాలిటీ అధ్యక్షులు షేక్ షాహుల్, విడవలూరు మండల పార్టీ అధ్యక్షులు కాటంరెడ్డి నవీన్ రెడ్డి, నియోజకవర్గ బూత్ కమిటీల ఇన్చార్జ్ కొండూరు లక్ష్మీనారాయణ రెడ్డి, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆనపల్లి ఉదయభాస్కర్, తదితరులు ఉన్నారు..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY