సీఐ రమేష్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్
10,000 రూపాయలు జరిమానా
చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో మద్యం తాగి వాహనం నడుపుతూ ఒక వ్యక్తి పట్టుబడ్డారు. నిందితుడిని ఏజేసీజే కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతడికి 10,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

