ఐడీఓసీ పెద్దపల్లిలో భగీరథ మహర్షి జయంతి ఘనంగా నిర్వహణ…
మహానీయుల స్ఫూర్తితో ముందుకు సాగాలి…
- అదనపు కలెక్టర్ డి.వేణు…
సాక్షిత పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డి.వేణు భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి. వేణు మాట్లాడుతూ, సమాజ హితం కోసం భగీరథ మహర్షి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గం నేటి సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని, మహానీయుల స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతిని అధికారికంగా నిర్వహించడం గర్వకారణమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి, వివిధ శాఖల అధికారులు, సంఘ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

