వడదెబ్బ బారినపడి సీనియర్ ఫోటోగ్రాఫర్ మృతి…
విధి నిర్వహణలోనే కుప్పకూలిన నగేష్… మంథనిలో విషాదం…
సాక్షిత పెద్దపల్లి/ పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ గంధం నగేష్ (55) వడదెబ్బతో ఆకస్మికంగా మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది.
విధి నిర్వహణలో భాగంగా ముత్తారం మండలం రామకృష్ణాపూర్ గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్లి కర్ణవేద కార్యక్రమానికి ఫోటోలు తీసి మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో తిరిగి ఇంటికి వస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు.
దీన్ని గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు నగేష్‌ను మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
శ్రీరామ ఫోటో స్టూడియో యజమానిగా పనిచేస్తున్న నగేష్ మృతి పట్ల మంథని పట్టణంలోని ఫోటోగ్రాఫర్ల యూనియన్ నాయకులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

