రామగుండం, తెలంగాణ ఎస్టీపీఎస్‌లో శిక్షణ కార్యక్రమం ప్రారంభం – సిబ్బంది నైపుణ్యాల పెంపే లక్ష్యం…..
సాక్షిత పెద్దపల్లి//ఎన్ టి పీ సి : రామగుండం, తెలంగాణ ఎస్టీపీసి లో పనిచేస్తున్న ఎఫ్‌టి/ఎంజీఆర్ వ్యవస్థల ఆపరేటింగ్ సిబ్బంది, అలాగే రిటైర్డ్ రైల్వే ఉద్యోగుల కోసం నాలుగు రోజుల రిఫ్రెషర్, అభివృద్ధి శిక్షణ కార్యక్రమం ఏప్రిల్ 20, 2026న ప్రారంభమైంది.
ఈ కార్యక్రమాన్ని కార్యనిర్వాహక సంచాలకుడు (ఆర్ & టీ) శ్రీ చందన్ కుమార్ సమంతా అధికారికంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జీఎం(ఓ& ఎం) ముఖుల్ రాయ్, రామగుండం జీఎం (ఓ & ఎం) మనీష్ అగర్వాల్, భద్రత విభాగం ఏజీఎం సుప్రకాశ్ చక్రబర్తి, హెచ్‌ఓహెచ్ఆర్ (ఆర్&టీ) సాగర్ రంజన్ సహూ తదితరులు పాల్గొని శిక్షణార్థులను ప్రోత్సహించారు.
ఏప్రిల్ 20 నుంచి 23 వరకు నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా ఎఫ్‌టి/ఎంజీఆర్ సిబ్బందిలో పనితీరు మెరుగుదల, భద్రతపై అవగాహన, నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నారు. కోంకణ్ రైల్వే అకాడమీకి చెందిన మేనేజర్ (టి&డి) సూర్య శేఖర్ ఈ కార్యక్రమానికి ప్రధాన శిక్షకుడిగా వ్యవహరిస్తూ, ముఖ్యమైన ఆపరేషన్, భద్రత అంశాలపై ప్రత్యేక శిక్షణ అందించనున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా సంస్థలో నైపుణ్యాల పెంపు, జ్ఞాన భాగస్వామ్యం, సురక్షితమైన, సమర్థవంతమైన కార్యకలాపాల నిర్వహణకు ఎన్టీపీసీ కట్టుబడి ఉందని వెల్లడించారు.

