కునికినపాడు గ్రామంలో వెల్నెస్ హెల్త్ సెంటర్ శంకుస్థాపన

Sakshitha news

కునికినపాడు గ్రామంలో వెల్నెస్ హెల్త్ సెంటర్ శంకుస్థాపన..

36 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం – ప్రజారోగ్య అభివృద్ధికి శ్రీకారం…

కంచికచర్ల మండలం కునికినపాడు గ్రామంలో మంగళవారం నాడు 36 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించబోయే వెల్నెస్ హెల్త్ సెంటర్ శంకుస్థాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి హాజరై శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ— గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వెల్నెస్ హెల్త్ సెంటర్ నిర్మాణం ద్వారా కునికినపాడు గ్రామ ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు మరింత చేరువ కానున్నాయని తెలిపారు. గ్రామ ప్రజల ఆరోగ్య భద్రత, మహిళలు–పిల్లల వైద్య సదుపాయాలు, నిరంతర ఆరోగ్య పరీక్షలు, పోషకాహార అవగాహన కార్యక్రమాలు వంటి సేవలు ఈ కేంద్రం ద్వారా అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో మార్కెట్ కమిటీల రాష్ట్ర ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు,కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఎమ్మెల్యే సౌమ్య కి కృతజ్ఞతలు తెలియజేస్తూ— ఈ హెల్త్ సెంటర్ తమ గ్రామానికి ఎంతో అవసరమైన సేవలను అందిస్తుందని అభిప్రాయపడ్డారు.

Scroll to Top