ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రతిభచూపిన తాటిపాముల విద్యార్థులను

Sakshitha news

ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రతిభచూపిన తాటిపాముల విద్యార్థులను
ఘనంగా సన్మానించి అభినందించిన……….సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్

సాక్షిత వనపర్తి : ప్రభుత్వ మోడల్ జూనియర్ కళాశాల ఇంటర్ ఫలితాలలో తమ ప్రతిభ చాటారు.

తాటిపాముల మాజీ సర్పంచ్ సత్యం యాదవ్ మరియు బీఆర్ఎస్ నాయకులు వెంకట్రాములుద్వారా విషయం తెలుసుకున్న *శంకర్ గౌడ్ సత్యం యాదవ్ మరియు వెంకట్రాములు తో కలసి ప్రతి విద్యార్థుల ఇంటికి వెల్లి వారి స్వగృహంలో విద్యార్థులను ఘనంగా సన్మానించి అభినందించారు.
ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్థులు సుకన్య-987, కళ్యాణి-825, మొదటి సంవత్సరం విద్యార్థులు మేఘన 464, 458 బిందు,433సుకన్య, అదే మౌనిక, సతీష్, భారతి లను ఘన సన్మానించారు.
ఈ సందర్భంగా *పలుస శంకర్ గౌడ్ *మాట్లాడుతూ విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని అన్నారు.

చదువులోనే కాకుండా విద్యార్థులు పరిసరాలు, సమాజం, కుటుంబం పట్ల అవగాహన కల్పించుకొని సమాజ అభివృద్ధికి తోడుపడుతూ పుట్టిన ఊరికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో దేశి రాములు యాదవ్, మాజీ సర్పంచ్ సత్యం యాదవ్, BRS నాయకులు వెంకట్రాములు,నాగన్న, డా. నారాయణ, తెలుగు శ్రీను ఆంజనేయులు, సుక్యనాయక్,వార్డు సభ్యులు తదితరులు ఉన్నారు.

Scroll to Top