చిలుకూరు అంగన్వాడీ కేంద్రంలో సీమంత కార్యక్రమం..

Sakshitha news

చిలుకూరు అంగన్వాడీ కేంద్రంలో సీమంత కార్యక్రమం..

సాక్షిత : చిలుకూరు..
హుజూర్నగర్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని చిలుకూరు సెక్టార్ అంగన్వాడి కేంద్రం 4 నందు పోషణ పక్షంలో భాగంగా సామూహిక సీమంత కార్యక్రమము ను నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా చిలుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సుభాష్ పాల్గొని గర్భిణీ స్త్రీలకు ఐదు సంవత్సరముల లోపు బాల బాలికలకు పోషక ఆహార అలవాట్లపై అవగాహన కల్పించారు. తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేశారు. బిడ్డ యొక్క వెయ్యి రోజుల బ్రెయిన్ డెవలప్మెంట్ దశలవారీ విషయాలను విశదీకరించారు. అనంతరము సీమంత కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ సునీత. టీచర్ సిరికొండ కవిత. వార్డు మెంబర్లు మహిళలు తల్లులు పాల్గొన్నారు.

Scroll to Top