చదువుతో పాటు క్రీడలపైనా దృష్టి పెట్టండి

Sakshitha news

చదువుతో పాటు క్రీడలపైనా దృష్టి పెట్టండి

** తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: విద్యార్థులు చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో కూడిన చదువుతోపాటు క్రీడలపై కూడా దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సూచించారు. ఆదివారం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియంలో రాజు విద్యాసంస్థలు, అలెన్ సంయుక్తంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు మెగా ఓరియెంటేషన్ కార్యక్రమం జరిగింది. ఈ మెగా ఓరియంటేషన్ కార్యక్రమంకు జిల్లా కలెక్టర్ తో పాటు టీటీడీ అడిషనల్ ఈఓ, అదనపు ఎస్పీ రవి మనోహర చారి, సీఐఎస్ఎఫ్ కమాండెంట్ అనురాగ్ యాదవ్, ఏపీఐఐసీ డిప్యూటీ జోనల్ మేనేజర్ చరణ్ రుద్రరాజు, రాజు విద్యాసంస్థల చైర్మన్ చమర్తి జగన్మోహన్ రాజు, అలెన్ సౌత్ ఇండియా హెడ్ మహేష్ యాదవ్ లు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు చదువుతోపాటు గంట పాటు క్రీడలకు కేటాయించడం వల్ల వారిలో శారీరక దృఢత్వం ఏకాగ్రత అలబడుతుందని చెప్పారు.

విద్యార్థులు మంచి స్నేహితులను ఏర్పరచుకోవాలని వారి ఆలోచనలు, వారు ఏమి కావాలనుకుంటున్నారో వారే నిర్ణయించుకోనేలా చూడాలన్నారు. నేడు విద్యార్థులు ఒత్తిడికి ఎక్కువ గురవుతున్నారని, సోషల్ మీడియా కు ఐదారు గంటల సమయం కేటాయించడం వల్ల వారిలో ఏకాగ్రత తగ్గిపోతోందన్నారు. ఏదో ఒక అవుట్డోర్ క్రీడగాని ఇండోర్ గేమ్ గాని తప్పనిసరిగా ఆడాలన్నారు. జీవితంలో చదువు ఒక భాగం మాత్రమేనని సూచించారు. టీటీడీ అడిషనల్ జేఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి గెలుపు ఓటములు సహజమేనని, ఫెయిల్యూర్ తో వచ్చిన విజయం కు ఎక్కువ విలువ ఉంటుందని చెప్పారు. వ్యక్తిలో భయం వీడియో ఉంటుందని, ఏ పని చేసిన భయాన్ని విడనాడాలని చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అదనపు ఎస్పీ రవి మనోహరాచారి మాట్లాడుతూ జీవితంలో పిల్లలకు క్రమశిక్షణ నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని చెప్పారు. క్రమశిక్షణతోనే విజయం సాధించవచ్చునని, ఓరియంటేషన్ కార్యక్రమం మొదట తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యార్థులను ఒక స్థాయికి తీసుకువచ్చేది తల్లిదండ్రులేనని చక్కగా చదువుకొని మంచి లక్ష్యాలతో ముందుకు సాగాలన్నారు.

రాజు విద్యాసంస్థల చైర్మన్ చమర్తి జగన్ మోహన్ రాజు మాట్లాడుతూ రాజు విద్యాసంస్థలు, అలెన్ సంయుక్తంగా తిరుపతిలో ఆరు సంవత్సరాల క్రితం ప్రారంభించి ఇప్పటికీ ఎంతోమంది విద్యార్థులను జేఈఈ, వైద్య విద్యార్థులను తయారు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు ప్రతిరోజు ఒక గంట పాటు క్రీడలకు కేటాయించాలన్నారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించడం రాజు విద్యాసంస్థల లక్ష్యమని, విద్యార్థులు ఐఐటీన్లుగా, వైద్యులుగా మారి తల్లిదండ్రులకు, అలెన్ కు మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నానని చెప్పారు. అనంతరం రాజు విద్యాసంస్థల కార్యదర్శి చమర్తి లోకేష్ రాజు మాట్లాడుతూ తిరుపతిలో రాజు విద్యాసంస్థలు, అలెన్ సంయుక్తంగా గత ఆరు సంవత్సరాలుగా మంచి ఫలితాలను సాధిస్తున్నామని, నాణ్యమైన విద్యతోపాటు విద్యార్థులకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించామని చెప్పారు. ఉపాధ్యాయులు అధ్యాపకులు ప్రతి ఒక్కరూ 10 సంవత్సరాలు పైబడి 30 సంవత్సరాలు అనుభవం కలిగిన అనుభవజ్ఞులచే బోధన చెప్పించడం జరుగుతుందని చెప్పారు. అనంతరం ఒలంపియాడ్ పథకాలు, మెరిట్, టాలెంట్ సర్టిఫికెట్లను వచ్చిన ముఖ్య అతిధుల చేతుల మీదుగా ఇప్పించడం జరిగింది. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులను తల్లిదండ్రులను అలరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జోనల్ హెడ్ విజయలక్ష్మి, నీట్ కోఆర్డినేటర్ అలెన్ రామ్ శ్రీనివాస్, అలెన్ జేఈఈ కోఆర్డినేటర్ అభిషేక్ జైన్, పి ఎన్ సి ఎఫ్ కోఆర్డినేటర్ సూర్య నారాయణ, రాజు, అలెన్ విద్యాసంస్థల సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top