నిరక్షరాస్యత లేని డివిజన్ గా తీర్చిదిద్దుదాం

Sakshitha news

నిరక్షరాస్యత లేని డివిజన్ గా తీర్చిదిద్దుదాం….

మహిళల విద్యే అభివృద్ధికి ప్రతీక….

-సిపిఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య పిలుపు…
….

సాక్షిత పెద్దపల్లి//గోదావరిఖని: రామగుండం కార్పొరేషన్ పరిధి 41వ. డివిజన్లో ఉల్లాస పథకంలో భాగంగా,ఆదివారం నిరక్షరాస్య మహిళలకు అక్షరాస్యతను నేర్పించడంతోపాటు ఈరోజు మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్ష కార్యక్రమానికి, ఆ డివిజన్ కార్పొరేటర్ సిపిఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మెప్మా సి ఓ శమంతక మణి తో కలిసి సూర్య మాట్లాడుతూ… రామగుండం కార్పొరేషన్లో 41వ. డివిజన్ అన్నింటికంటే భిన్నమైన డివిజన్ గా అభివృద్ధి చేయడంలో మహిళా సోదరీమణులు సహకరించాలని కోరారు.

ఎక్కడైతే మహిళలు ఎక్కువ శాతం విద్యను అభ్యసించి అక్షరాస్యత కలిగిన మహిళలు ఉంటారో ఆ ప్రాంతం అన్ని ప్రాంతాల కంటే ఎక్కువ అభివృద్ధి చెందుతుందని అందుకోసమని,కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ పథకం ద్వారా వీలైనంతమంది నిరక్షరాస్య మహిళలు విద్య నేర్చుకోవాలని సూర్య అభిప్రాయపడ్డారు.

ఒక డివిజన్ అభివృద్ధి అంటే ఆ డివిజన్లో మౌలిక సదుపాయాల కల్పన కాకుండా నిరక్షరాస్యులకు అక్షరాస్యత కల్పించడం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లాంటి పనుల వల్ల కూడా డివిజన్ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. సమాఖ్య సంబంధించిన ఆర్పీలతో మాట్లాడుతూ.. మన డివిజన్ కు సంబంధించిన నిరక్షరాస్యుల జాబితా తయారు చేయాలని వారందరికీ త్వరలో ఒక పాఠశాలను ఏర్పాటు చేసి, రెండు నెలలపాటు తన సొంత ఖర్చులతో డివిజన్లోని నిరక్షరాస్య మహిళలందరికీ విద్య నేర్పించడానికి ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా సూర్య మాటిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆర్పీలు స్వర్ణలత, సరోజ, సుశీల, సభ్యులు దేవలక్ష్మి, రాధా ,ప్రమీల, సురేఖ, కళావతి, లక్ష్మీ, పోచమ్మ, సమ్మక్క, మంజుల తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top