హైదరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన ఎమ్మెల్యే నాగరాజు

Sakshitha news

హైదరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన ఎమ్మెల్యే నాగరాజు ..

వర్ధన్నపేట నియోజకవర్గానికి 100 EV బస్సులు, నూతన EV బస్ చార్జింగ్ స్టేషన్ కోసం ఆర్టీసీ అధికారులతో కలిసి వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే నాగరాజు ..

హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కే ఆర్ నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై మంత్రి దృష్టికి తీసుకెళ్లుతూ వినతి పత్రం సమర్పించారు.

ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని వరంగల్ మండల పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ పైడిపల్లి గ్రామ సమీపంలో సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని, ఆ స్థలంలో నూతన EV చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. దీనివల్ల ప్రాంతీయ రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు, పర్యావరణానికి అనుకూలమైన ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుందని తెలిపారు…

అదేవిధంగా, నియోజకవర్గానికి 100 కొత్త EV బస్సులను కేటాయించాలని మంత్రి ప్రభాకర్ గౌడ్ వద్ద విజ్ఞప్తి చేశారు. ఈ బస్సుల ద్వారా ప్రజలకు మెరుగైన, ఆధునిక రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక, కొత్తగా ఏర్పాటు చేయనున్న బస్ స్టేషన్ మరియు EV బస్సుల నిర్వహణలో స్థానిక యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే నాగరాజు స్పష్టం చేశారు. RTC సంస్థలో స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ప్రాంతీయ అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆయన పేర్కొన్నారు.

ఈ విషయాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సానుకూలంగా స్పందించారు.ప్రతిపాదనలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు….

Scroll to Top