భావోద్వేగంతో నిరసన తెలిపిన వారిపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఖండించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
సాక్షిత వనపర్తి :

అక్షర స్కూల్ లో మైనార్టీ విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి మొత్తం సమాజానికి తలవంపు చర్యగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభివర్ణించారు.
అత్యంత హేయమైన సంఘటనను యాజమాన్యం పోలీసులకు తెలియజేయకుండా దాచిపెట్టడం నేరమని నిరంజన్ రెడ్డి అన్నారు.
సంఘటనబాధితులకు అండగా నిలవాల్సిన పోలీస్ అధికారులు భావోద్వేగంతో నిరసన తెలిపినవారిపై ప్రశ్నించడానికి వెళ్ళిన బి.ఆర్.ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి భేషరతుగా అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
సమాజములో జరుగుతున్న అసహజ సంఘటనలు మనసును కలచివేస్తున్నాయి.
నేరప్రవృతి పశువుల కంటే హీనంగా పెచ్చరిల్లుతున్నది ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పశువులైన కనీసం తమ ఈడు జోడు చూసుకొంటున్నాయని అంతకంటే అత్యంతహీనంగా సమాజములో లైంగిక దాడుల ప్రవృత్తి పెరిగిపోతుందని అన్నారు.
బాల్యం నుంచే వ్యక్తి పెరుగుదలలో సరియిన వికాసం,చైతన్యం,లింగగౌరవం పెంపొందించకపోవడం వ్యవస్థలో పెద్దలోటు అని అభిప్రాయపడ్డారు.
కొందరు సమగ్రత లోపించి మహిళల వస్త్రాధరణ,వేషాధారణ లైంగిక దాడులకు కారణం అంటూ తమ అపరిపక్వత్తను చాటుకుంటారు.
మరీ చిన్నారి బాలికల మీద లైంగిక దాడులకు ఏ వస్త్రాధరణ, వేషాధారణ కారణం
కాబట్టి పెంపకం, పరిసరాల ప్రభావం,కుటుంబాలు వాటి పాత్రను సమర్థవంతంగా పోషించడం ముఖ్యం అని భావించాలని మాజీ మంత్రి అన్నారు.
SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
