రంజాన్ మాసం సహనం మరియు సోదరభావానికి ప్రతీక అని.. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు.
రంజాన్ కానుకలు పంపిణీ చేసిన.. కార్పొరేటర్ .
శేరిలింగంపల్లి డివిజన్… నెహ్రూనగర్ మస్జీద్ ఈ నూరని వద్ద నిర్వహించిన రంజాన్ తోఫా కార్యక్రమానికి శేరిలింగంపల్లి కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. రంజాన్ మాసం అనేది ముస్లిం సమాజానికి అత్యంత పవిత్రమైన కాలంగా భావిస్తారని అన్నారు.
ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, దానధర్మాలు చేస్తూ.. ఆధ్యాత్మిక భావనతో ఈ మాసాన్ని గడుపుతారని.. ఈ నేపథ్యంలో ముస్లిం సోదరులకు సహాయంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రంజాన్ తోఫాలను అందజేయడం జరిగిందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
పేద ముస్లిం కుటుంబాలు పండుగను సంతోషంగా జరుపుకోవాలనే లక్ష్యంతో ఈ తోఫా అందజేస్తున్నామని తెలుపుతూ.. అందరికీ ముందస్తు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మస్జీద్ ఈ నూరని ప్రెసిడెంట్ షైక్ గఫర్, మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మ, SLVDC ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్, ఖాదర్ ఖాన్, గఫుర్, తహేర్, ఇర్ఫాన్, సల్మాన్, షైబాజ్, అలీం, ముక్రమ్, నసీమ్, ఇబ్రహీం, షాదిక్, జైనుద్దీన్, జావీద్, దస్తగిర్, ఖలేద్, వెంకటయ్య స్థానిక ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

