124 అల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని మహాత్మా గాంధీ నగర్ లో 40 ఫీట్ రోడ్డు గుంతలు పడి వాహనదారులకు ఇబ్బందికరంగా ఉందని కాలనీ వాసులు సమస్యను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురావడం జరిగింది. కార్పొరేటర్ కాలనీలో పర్యటించి, రోడ్డు సమస్యలు పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే ప్యాచ్ వర్క్ పనులు ప్రారంభించి రోడ్డుపైన గుంతలు లేకుండా చేయాలని ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ 40 ఫీట్ రోడ్డు ఇప్పటికే శాంక్షన్ లో ఉంది కాబట్టి త్వరలో నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులు మొదలుపెట్టి కొత్త రోడ్డును నిర్మిస్తామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గుడ్ల శ్రీనివాస్, చిన్నోళ్ల శ్రీనివాస్, పోశెట్టిగౌడ్, నాగేష్, గిరి, రాజారామ్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
